: ఆర్ధికవృద్ధి ఊపందుకోవాలంటే విద్యే ప్రధానం: మన్మోహన్


విద్యారంగంపై దృష్టి సారించకుండా వృద్ధిరేటును కొనసాగించటం కష్టమని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. భారత శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచవేదికపై రాణించాలంటే యువతకు ప్రపంచస్థాయి విద్య అవసరమన్నారు. అందుకే యూపీఏ ప్రభుత్వం ఆర్ధికవృద్ధి ఊపందుకునేందుకు విద్యపై ప్రత్యేక దృష్టి పెడుతోందని అన్నారు. దేశ  ఆర్ధిక అవసరాలు తీర్చడం కోసమే తమ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని చెప్పారు.

పశ్చిమ బెంగాల్లోని మల్దా జిల్లాలో ఘనీ ఖాన్ చౌదరి 'ఇనిస్టిట్యూట్
ఆప్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ' శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మన్మోహన్... జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)లో విద్య వాటాను 3.3 నుంచి 4 శాతానికి పెంచినట్లు తెలిపారు. ఉన్నతస్థాయి విద్య కోసం ప్రభుత్వం కొత్త కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటి, ఐఐఎమ్, ఎన్ఐఐటి లను పరిచయం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ గవర్నర్ ఎమ్ కే నారాయణన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News