: అనూహ్య కుటుంబానికి సీఎం, విజయమ్మ పరామర్శ
ముంబైలో దారుణ హత్యకు గురైన మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శింగవరపు ఎస్తేరు అనూహ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫోన్లో పరామర్శించారు. జరిగిన దారుణాన్ని ఖండించి.. అనూహ్య తండ్రికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని, గుండె దిటవు చేసుకోవాలని సూచించారు.