: అలసత్వం వద్దు.. ప్రయత్నలోపం, అతి విశ్వాసం వద్దు: అద్వానీ హితబోధ
దశాబ్దకాలం విరామం తరువాత అధికారంలోకి వచ్చేందుకు ఇదే చక్కటి తరుణమని బీజేపీ సీనియర్ నేత అద్వానీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి అధికారంలోకి రావడానికి చేసే ప్రయత్నాల్లో ఏ రకమైన లోపం ఉండకూడదని సూచించారు. అతివిశ్వాసం మొదటికే ముప్పుతెస్తుందని ఆయన అన్నారు. 2004 ఎన్నికల్లో అతివిశ్వాసమే తమ కొంపముంచిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈసారి గతం నుంచి నేర్చుకున్న గుణపాఠంతో విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.