: తొలి వన్డేలో భారత్ ఓటమి
న్యూజిలాండ్ లోని నేపియర్ లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఆతిధ్య జట్టు బౌలింగ్ ధాటికి 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు అర్థసెంచరీలు సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 292 పరుగులు చేసింది. అనంతరం 293 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కోహ్లీ (123), ధావన్ (32), ధోనీ (40) రాణించడంతో 268 పరుగులు సాధించింది. దీంతో 24 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. భారత బౌలర్లలో షమి(4) రాణించగా, న్యూజిలాండ్ బౌలర్లలో మెక్ క్లెంగన్(4) రాణించాడు.