: మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో 48 రోజులు ప్రయాణించిన బాలుడు


రక్తం గడ్డకట్టుకుపోయే వాతావరణం ... మైనస్ 50 డిగ్రీలు. మనుషులు సైతం తూలిపడేంతగా 193 కిలోమీటర్ల వేగంతో విపరీతమైన గాలులు. అయినా సరే ఓ 16 ఏళ్ల బ్రిటన్ బాలుడు లూయిస్ క్లార్కే లక్ష్యం కోసం లెక్కచేయలేదు. అలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో 48 రోజుల పాటు ప్రయాణించి దక్షిణ ధృవాన్ని చేరుకున్న అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 1,129 కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఆముండ్ సేన్ స్కాట్ దక్షిణ ధృవ స్టేషన్ ను చేరుకుని విజయకేతనం ఎగురవేశాడు.

  • Loading...

More Telugu News