: డబ్బులివ్వలేకే వైఎస్సార్సీపీకి దూరమవుతున్నా: బుచ్చి మహేశ్వర్ రావు
డబ్బుతో టికెట్ కొనలేకే వైఎస్సార్సీపీకి దూరమవుతున్నానని మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వర్ రావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో డబ్బులిస్తేనే టిక్కెట్లు ఇస్తున్నారని అన్నారు. 30 కోట్ల రూపాయలకు అమలాపురం ఎంపీ టికెట్ కొనుక్కున్నట్టు మాజీ మంత్రి విశ్వరూప్ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రజారాజ్యంలాగే వైఎస్సార్సీపీ కూడా డబ్బులు దండుకుని కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని ఆయన ఆరోపించారు.