: అద్దంకిలో స్వల్ప భూకంపం
ప్రకాశం జిల్లా అద్దంకిలో భూకంప కలకలం రేగింది. అద్దంకిలో ఉదయం 10 గంటల 53 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించింది. పెద్దగా శబ్ధం రావడం, ఇంట్లోని సామాన్లు అన్నీ పడిపోవడంతో భూకంపం వస్తోందని భావించిన ప్రజలు, ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.