: తిరుమల ఆలయంలోకి కెమెరాతో వెళ్లబోయిన వ్యక్తి అరెస్టు
పెన్ కెమెరాతో తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఆలయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో ఆలయంలోనికి కెమెరాలతో ప్రవేశించడం నిషేధించిన సంగతి విదితమే. పెన్ కెమెరాతో ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తిని బెంగళూరుకు చెందిన ప్రభాకర్ గా విజిలెన్స్ అధికారులు గుర్తించారు.