: రొమ్ము కేన్సర్ కు ఈ 'తులసి' దివ్యౌషధం!


'నాలుగు తులసి ఆకులు నోట్లో వేసుకుని నములు...' ఈ డైలాగు మనం మన పెద్దల నోట చాలాసార్లు వింటుంటాం!
ఇంట్లో ఎవరైనా దగ్గుతున్నప్పుడు మన పెద్దవాళ్ళు ఇచ్చే చిట్కా వైద్యం ఇది.
హిందువులు దైవంతో సమానంగా భావించే తులసిలో ఔషధగుణాలు ఎన్నో ఉన్నాయనడానికి నిదర్శనమిది!

దీనిని శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. అందుకే, తులసిని మరింత ఉపయోగకారిగా మలచడానికి ఈ మొక్కకు జన్యుమార్పిడి చేసే ఆలోచన చేస్తున్నారు. అమెరికాలోని సౌత్ కెంటకీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న భారత అమెరికన్ శాస్త్రవేత్త ఈమని చంద్రకాంత్ బృందం తులసిపై చాలా ప్రయోగాలు చేస్తోంది.

ఈ మొక్కలో 'యూజేనాల్' అనే పదార్ధం పెరిగేలా జన్యుమార్పిడి చేస్తున్నారు. రొమ్ము కేన్సర్ ను సమర్థవంతంగా నియంత్రించడంలో యూజేనాల్ పాత్ర అమోఘమని ఇప్పటికే తేలింది. అందుకే, తులసిలో ఈ పదార్థాన్ని పెంచితే, ఇది ఈ తరహా కేన్సర్ కు దివ్యౌషధం అవుతుందని చంద్రకాంత్ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News