: రాష్ట్రంలో 4జీ సేవలపై మంత్రి పొన్నాల సమీక్ష
రాష్ట్రంలో 4జీ సేవలకు సంబంధించి ఉన్నతాధికారులతో మంత్రి పొన్నాల లక్ష్మయ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 14 పట్టణాల్లో 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. వరంగల్ నగరంలో ఇప్పటికే 4జీ పనులు పూర్తి అయ్యాయని మంత్రి ప్రకటించారు. మిగిలిన ప్రాంతాల్లో ఈ టెలికాం సేవలకు సంబంధించిన పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 4జీ సేవల వల్ల మొబైల్ ప్రసారాలు, డేటా ట్రాన్స్ ఫర్ ధరలు తగ్గుముఖం పడతాయని పొన్నాల చెప్పారు.