: మిథున్ చక్రవర్తికి బంపరాఫరిచ్చిన దీదీ
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బాలీవుడ్ లో అందరూ ముద్దుగా 'దా'(పెద్దాయన)గా పిలుచుకునే మిథున్ చక్రవర్తిని పెద్దల సభకు పంపాలని దీదీ నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మిథున్ చక్రవర్తి పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన చేసిన సామాజిక సేవ పలువురి జీవితాల్లో వెలుగులు నింపిందని మమతా బెనర్జీ కొనియాడారు.
ఆల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్ పార్టీ తరపున మిథున్ చక్రవర్తిని రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు దీదీ ఇప్పటికే పూర్తి చేశారని సమాచారం. ఈ రకంగా మమతా బెనర్జీ సినీ పరిశ్రమపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ సినీ నటులను సత్కరిస్తూ వారి అభిమానులను మమతా బెనర్జీ ఆకట్టుకుంటూనే ఉన్నారు.