: శశిథరూర్ కు సునంద మృతదేహం అప్పగింత
ఢిల్లీలోని స్టార్ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతదేహాన్ని స్వగృహానికి తరలించారు. శవపరీక్ష అనంతరం ఎయిమ్స్ వైద్యులు సునంద మృతదేహాన్ని శశిథరూర్ కు అప్పగించడంతో ఆయన తన నివాసానికి తీసుకెళ్లారు. అయితే శవపరీక్షలో ఆమెది అసాధారణ మరణం అని వైద్యులు తేల్చిన సంగతి తెలిసిందే.