: గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనం ఆరు వేలకు పెంపు: రఘువీరారెడ్డి
గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వేతనాన్ని మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు రఘువీరారెడ్డి శాసనసభలో ప్రకటించారు. వేతన పెంపు ప్రతిపాదన దస్త్రం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు.