: సామాన్యుడి చెంతకే అధికారం..ఆప్ లక్ష్యం అదే!: ప్రశాంత్ భూషణ్


సామాన్యుడి చెంతకు అధికారాన్ని తీసుకువెళ్లేందుకే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ప్రశాంత్ భూషణ్ అన్నారు. హైదరాబాద్ పంజాగుట్టలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఆప్ ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇతర నేతలతో సమావేశమై తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. ఈ కార్యాలయాన్ని పార్టీకి చెందిన ఓ కార్యకర్త విరాళంగా ఇచ్చారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News