: నిందితుడిని గుర్తించాం... పట్టుకోవాలి: డీజీపీ
దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేుసులో సీసీటీవీ ఫుటేజీలో ఉన్న నిందితుడి వివరాలు తెలిసాయని, అతడిని పట్టుకోవాల్సి ఉందని డీజీపీ దినేష్ రెడ్డి చెప్పారు. పేలుళ్లకు పాల్పడింది ముస్లిం జీహాదీ సంస్థలా? లేక హిందూ అతివాద సంస్థలా? అన్నది ఇంత వరకూ వెల్లడి కాలేదని తెలిపారు. బాంబు పేలుళ్ల కేసులో ఒక మతం వర్గం వారినే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్న ఆరోపణలు సరికాదన్నారు.