: బెంగాలీ సంపద్రాయంలోనే వివాహం చేసుకుంటా: బిపాషా బసు


బాలీవుడ్ నటి బిపాషా బసు ఎట్టకేలకు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, వివాహం సాధారణ బెంగాలీ సంప్రదాయంలోనే చేసుకుంటానని స్పష్టం చేసింది. అలా తాను చేసుకోకపోతే తన తల్లి పెళ్లికి రానని హెచ్చరించిందని తెలిపింది. కాబట్టి, తప్పకుండా అలానే చేసుకుంటానంటోంది. బెంగాలీ కుటుంబానికి చెందిన బిపాషా సిని పరిశ్రమలో అడుగుపెట్టాక ఆరేళ్లకు పైగా నటుడు జాన్ అబ్రహాంతో చెట్టాపట్టాలేసుకు తిరిగింది. అనంతరం అతడితో విడిపోయిన ఈ భామ మరో నటుడు హర్మాన్ భవేజాతో డేటింగ్ చేస్తోంది. త్వరలో బిప్స్ అతడిని వివాహం చేసుకోనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News