: తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్: చంద్రబాబు
తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఎన్టీఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సమేతంగా నివాళులర్పించిన అనంతరం ఎన్టీఆర్ ను చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. రాజకీయాలంటే ఏమిటో ఆయనను చూసి నేర్చుకోవాలని, చేసిన వాగ్దానాలను అమలు చేసి ఆయన ప్రజాభిమానాన్ని చూరగొన్నారని బాబు అన్నారు. ఆత్మ గౌరవ పోరాటం చేసి తెలుగు జాతికి రామారావు గుర్తింపు తెచ్చారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను కూకటివేళ్లతో సహా పెకిలించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన అడుగుజాడల్లో నడిచి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకువస్తామని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన మాట ఇచ్చారు.