: శశిథరూర్ డిశ్చార్జ్
భార్య సునందపుష్కర్ హఠాన్మరణంతో ఆస్పత్రిపాలైన కేంద్ర మంత్రి శశిథరూర్ ఈ ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. నిన్న రాత్రి ఛాతీలో నొప్పి, అసౌకర్యంగా ఉండడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు. నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక హోటల్లో సునంద పుష్కర్ శవమై తేలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఎయిమ్స్ కు తీసుకెళ్లగా ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అధిక రక్తపోటు, పరిమితికి మించిన గుండె స్పందనలు ఉన్నాయని, దానికి చికిత్స చేశామని ఎయిమ్స్ సూపరింటెండెంట్ డీకే శర్మ తెలిపారు. చికిత్స అనంతరం థరూర్ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఈ ఉదయం డిశ్చార్జ్ చేశారు.