: ఎయిమ్స్ కి సునంద పుష్కర్ మృతదేహం తరలింపు
నిన్న అనుమానాస్పద రీతిలో ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ లీలాప్యాలెస్ లో మృతి చెందిన కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఆమె మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.