: ముంబయి, మలబార్ హిల్స్ లో తొక్కిసలాట: 18 మంది మృతి
ఆధ్యాత్మిక గురువు మహహ్మద్ బురానుద్దీన్ అంత్యక్రియల సందర్భంగా ముంబయి, మలబార్ హిల్స్ లో ఈ రోజు ఉదయం జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సైఫీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.