: షిండేను కలిసిన కేజ్రీవాల్
ఢిల్లీ పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. ఢిల్లీ శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసులు తమ ప్రభుత్వానికి సహకరించడం లేదని షిండేకు ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలు తమ ఆధీనంలో ఉంచితే మరింత సమర్థవంతంగా తాము నేరాలను అదుపు చేస్తామని షిండేకు ఆయన సూచించారు.