: ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో 'కృషి కర్మన్' అవార్డు
ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో మరో అవార్డు వచ్చి చేరింది. చిరుధాన్యాల ఉత్పత్తి పెంపుకు గణనీయమైన కృషి చేసినందుకు 'కృషి కర్మన్' అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. ఈ పురస్కారాన్ని ఫిబ్రవరి 10న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అందుకోనున్నారు.