: సబ్సిడీ సిలిండర్లను 12కు పెంచుతున్నాం: మొయిలీ ప్రకటన
సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను తొమ్మిది నుంచి 12కు పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. ఈ రోజు ఏఐసీసీ సమావేశంలో ప్రసంగించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... సబ్సిడీ సిలిండర్లను పన్నెండుకు పెంచాల్సిందే అన్న వెంటనే, అదే వేదికపై మొయిలీ ఈ ప్రకటన చేయడం విశేషం. కాగా, నిన్నటివరకు సిలిండర్ల సంఖ్యను పెంచేది లేదని మొయిలీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.