: ఆడ పిల్లలకు రక్షణ లేకుండా పోయింది: చంద్రబాబు


ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లిందంటే క్షేమంగా చేరుతుందో లేదోననే భయం వెంటాడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెట్రోనగరాలలో నేరాల తీరు చూస్తుంటే మనవ మృగాలు ఏ రీతిగా చెలరేగిపోతున్నాయో అర్థమవుతుందని ఆన్నారు. చదువుకున్న ఆడపిల్ల బయటకు వస్తే చాలు ఘోరాలు జరిగిపోతున్నాయని అంటూ... తాజాగా ముంబై డ్యాన్సర్, ఢిల్లీలో విదేశీ మహిళ అత్యాచారాలను ఆయన గుర్తు చేశారు. పేద మహిళను అన్ని రకాలుగా ప్రోత్సహించి ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావాలనేది తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News