: అశోక్ బాబుపై కేసు నమోదు చేయండి: రంగారెడ్డి జిల్లా కోర్టు


ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుపై కేసు నమోదు చేయాలంటూ హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులకు రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భోగి మంటల్లో టీబిల్లు ప్రతులను దహనం చేసిన కార్యక్రమంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బిల్లు ప్రతులను భోగి మంటల్లో దహనం చేసిన అశోక్ బాబుపై చర్యలు తీసుకోవాలని సుంకరి జనార్ధన్ గౌడ్ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News