: మరోసారి ఆలింగనం చేసుకున్న సల్మాన్, షారుక్!


బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ మరోసారి ఆలింగనం చేసుకున్నారు. తాజాగా, ముంబయిలో స్టార్ గిల్డ్ అవార్డుల కార్యక్రమం జరిగింది. దీనికి సల్మాన్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా 'ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును షారుక్ కు ప్రకటించారు. వెంటనే బాద్షా వేదికపైకి రాగానే సంప్రదాయం ప్రకారం అక్కడే ఉన్న సల్లూ ఆలింగనం చేసుకుని చిరునవ్వులు చిందించారు. ఈ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసిన అక్కడి సినీ ప్రముఖులు, ప్రేక్షుకులు థ్రిల్ గా ఫీలయ్యారు. గతేడాది ముంబయిలో ఓ రాజకీయ నేత ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైన సల్మాన్, షారుక్ తొలిసారి ఆలింగనం చేసుకున్నారు. దాంతో, వీరిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయాయని అందరూ అనుకున్నారు.

  • Loading...

More Telugu News