: 35 ఏళ్ల లోపు అభ్యర్థులకే కాంగ్రెస్ సీట్లు ఇవ్వాలి: చిదంబరం


రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానానికి కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఓ సలహా ఇచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాల్లో భాగంగా ప్రసంగించిన ఆయన.. తనకో తీవ్రమైన ఆలోచన వచ్చిందని దానికి మిగతావారి మద్దతు కూడా లభిస్తుందనుకుంటున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో సగం పార్లమెంటు సీట్లను ముప్పై ఐదేళ్ల లోపు అభ్యర్థులకే కాంగ్రెస్ కట్టబెట్టాలని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాన్ని యువ భారతం విజయ తీరాలకు తీసుకువెళుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, 2014 లోక్ సభ ఎన్నికల్లో పార్టీని రాహుల్ గాంధీ నడుపుతారని చెప్పారు.

  • Loading...

More Telugu News