: ఇంకా జోడీ లేదు... నేను ఒంటరినే: దీపికా పదుకొనే
తాను ఒంటరినేనని.. జోడీలేదని నటి దీపికా పదుకొనె స్పష్టం చేసింది. రామ్ లీలాలో సహనటుడు రణవీర్ సింగ్ తో దీపికాపదుకొనేకు అఫైర్ అంటకడుతూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆమె వివరణ ఇచ్చింది. తనపై వినిపిస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. మీరు ఒంటరేనా? అని విలేకరులు అడగ్గా.. 'అవును అవును... ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా?' అంటూ ఎదురు ప్రశ్నించింది. మరి ఈ నెల 5న తన పుట్టిన రోజును రణవీర్ సింగ్ తో కలిసి న్యూయార్క్ లో జరుపుకోవడంలో మర్మమేంటో దీపిక చెప్పలేదు.