: అలా అలోచిస్తే.. నాలో నటుడు మరణించినట్లే: అమితాబ్
నటన నుంచి విరమణ తీసుకునే ఆలోచన లేదని అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ఇంకా నటించాల్సింది ఎంతో ఉందన్నారు. 71ఏళ్ల వయసులో ఇంకా ఎందుకు నటిస్తున్నాననే ప్రశ్న చాలా సార్లు తలెత్తిందని.. కానీ, నటించడం ఆపితే అనారోగ్య భావనకు గురవుతానన్నారు. 'నటనతో సంతృప్తి చెందితే, ఎంతో చేశానని భావిస్తే.. మరుక్షణమే నాలో ఉన్న నటుడు చనిపోతాడు. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా' అంటూ ప్రకటించారు. తద్వారా అమితాబ్ నటనపై ఇంకా తనకు మక్కువ తీరలేదని చెప్పకనే చెప్పారు.