: విశాఖ ఘటనపై కమిటీ వేసిన టీడీపీ


గత నెలలో విశాఖ టీడీపీ నేతల మధ్య చెలరేగిన వివాదంపై ఆ పార్టీ దృష్టి సారించింది. దీనిపై కె.ఇ. కృష్ణమూర్తి, కళా వెంకట్రావులు సభ్యులుగా విచారణ కమిటీ వేసింది. జనవరి నెలలో సరిగ్గా ఎన్టీఆర్ వర్ధంతి రోజున విశాఖ నేతల మధ్య జరిగిన చిన్న గొడవ, చినికి చినికి గాలి వానలా మారింది.

దీంతో ఈ వివాదానికి కారకుడైన పీలా శ్రీనివాస్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇందుకు ఆ్రగహించిన ఆ జిల్లా టీడీపీ నేత చింతాకాయల అయ్యన్న పాత్రుడు ఏకంగా పోలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పీలా శ్రీనివాస్ ను ఈ నెల 7న హైదరాబాదు కార్యాలయానికి రావాలంటూ విచారణ కమిటీ సమాచారం పంపింది.

  • Loading...

More Telugu News