: అలనాటి సినీ నటి సుచిత్రా సేన్ కన్నుమూత


అలనాటి సినీనటి సుచిత్రాసేన్ (83) ఈ ఉదయం 8.25 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా హృదోగ సమస్యలతో బాధపడుతూ, కోల్ కతా లోని సిటీ హోమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆంది, దేవదాస్ వంటి పలు చిత్రాల్లో నటించిన ఆమె, అంతర్జాతీయ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఖ్యాతి గడించారు. భారత ప్రభుత్వం 1972 లో పద్మశ్రీ పురస్కారంతో సుచిత్రా సేన్ ను సత్కరించింది. దేవదాస్ చిత్రానికి ఆమె ఉత్తమనటిగా పురస్కారాన్ని అందుకున్నారు.

  • Loading...

More Telugu News