: శాసనసభ సమావేశాలు ప్రారంభం.. అరగంట పాటు వాయిదా
శాసనసభ సమావేశాలు ఈ ఉదయం 9.00 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే తెలంగాణ, సమైక్య ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చను కోరుతూ టీడీపీ, విభజన బిల్లుపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలిపేందుకు ఓటింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సభ సజావుగా సాగటానికి సహకరించాలని స్పీకర్ చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో అరగంట పాటు వాయిదా వేశారు.