: పెళ్లిపై మాట మార్చిన నటి కవిత కూతురు


కారు డ్రైవర్ ను ప్రేమించి పెళ్లాడిన సినీ నటి కవిత కూతురు ఒక్క రోజైనా గడవక ముందే మాట మార్చేసింది. మత్తుమందు ఇచ్చి డ్రైవర్ రాజ్ కుమార్ తనను పెళ్లి చేసుకున్నాడని తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ కుమార్ తో తన పరిచయం కేవలం 15 రోజులేనని వెల్లడించింది. ఒక షాపింగ్ మాల్ లో అతడు పరిచయం అయ్యాడని తెలిపింది.

ఆ తర్వాత ఒక రోజు కూల్ డ్రింక్  ఇచ్చాడని, అది తాగిన తర్వాత ఏం జరిగిందో తనకు తెలియనీ చెప్పింది. స్పృహ వచ్చిన తర్వాత చూసుకుంటే మనిద్దరికీ వివాహమైందని రాజ్ కుమార్ తనతో చెప్పాడని మాధురి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మాధురి, రాజ్ కుమార్ గురువారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో దళిత నేతల సమక్షంలో స్థానిక వెంకటేశ్వరాలయంలో వివాహం చేసుకున్నారు. వీరు గత రెండేళ్ల నుంచీ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. కవిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రాజ్ కుమార్ ను అదేరోజు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మాధురి కూడా రాజ్ కుమార్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం సంచలనానికి దారితీసింది. దీనికి కుటుంబ సభ్యుల ఒత్తిడే కారణమై ఉంటుందని అంటున్నారు. 

  • Loading...

More Telugu News