: రెండోరోజూ.. మరింత జోరుగా జల్లికట్టు
పొంగల్ వేడుకల్లో భాగంగా తమిళులు నిర్వహించే జల్లికట్టు క్రీడ రెండో రోజు మరింత జోరుగా కొనసాగింది. ఎద్దు కొమ్ముకు కిరీటాన్ని తగిలించి నిర్వాహకులు వదిలారు. కిరీటాన్ని అందుకోవటానికి వందలాది మంది యువకులు క్రీడా మైదానంలో ఎద్దు వెంట పరుగెడుతూ ఈ క్రీడలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒళ్లు జలదరించే విధంగా ఈ జల్లికట్టు క్రీడ కొనసాగినా.. వీక్షకులు ఆనందాశ్చర్యాల్లో మునిగితేలారు. తమిళనాడులోని పాలమేడులో నిర్వహించిన ఈ పోటీల్లో గిత్తలతో యువకులు హోరాహోరిగా తలపడ్డారు.