: వాయిదాలే వాయిదాలు !
శాసనసభ సమావేశాలు శనివారం రెండోసారి వాయిదా పడ్డాయి. మొదటి వాయిదా అనంతరం మొదలైన సభ పట్టుమని 10 నిమిషాలు కూడా నడవలేదు. యథావిధిగా విపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. బాబ్లీ అంశంపై టీడీపీ, తెలంగాణపై టీఆర్ఎస్, బీజేపీ గళమెత్తాయి. సాగునీరు, కరెంటు కోతలు, సర్ ఛార్జీలపై చర్చ చేపట్టాలని సీపీఐ డిమాండు చేసింది. దీంతో సభ జరిగేందుకు సహకరించాలని స్పీకర్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు వినకపోవడంతో నాదెండ్ల మనోహర్ సభను అర్ధగంట పాటు వాయిదా వేశారు.