: దావూద్ అనుచరుడికి కూడా టీటీడీ దర్శనం కల్పించింది: గాలి


వైకుంఠ ఏకాదశి రోజున ప్రముఖులకు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కల్పించడంపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అజయ్ నావనర్ కు కూడా టీటీడీ అధికారులు దర్శనం కల్పించారని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. అక్కడ ఉండేందుకు ఆయనకు శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ ను కూడా ఇచ్చారని మండిపడ్డారు. ధర్నా చేశారని భక్తులపై కేసులు పెట్టడానికి వారేమైనా దొంగాలా? దోపిడీ దారులా? అని గాలి ప్రశ్నించారు. అలాంటప్పుడు దర్శన టికెట్లు అమ్ముకున్న వారిపై కేసులు ఎందుకు పెట్టరని నిలదీశారు. వైకుంఠ ఏకాదశినాడు వీఐపీ పాసుల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News