: ప్రపంచ ఆహార సూచీలో మనమెక్కడ?


పేరుగొప్ప.. ఊరుదిబ్బ అన్న సామెత ఆహారం విషయంలో భారత్ కు సరిపోతుందేమో? ఆర్థికంగా ఎంత మెరుగైన స్థితి వైపు పయనిస్తున్నా.. సమాచార సాంకేతిక ఫలాలను అనుభవిస్తున్నా.. ఆహార భద్రత లేదని తేటతెల్లమవుతోంది. 125 దేశాలతో కూడిన ప్రపంచ ఆహార సూచీలో.. అట్టడుగు 30 దేశాల్లో భారత్ ఉండడమే ఇందుకు నిదర్శనం.

పోషకాహారలేమి, ఆహార ధరలు, నాణ్యమైన ఆహారం అందుబాటు, ఆహారం వల్ల ఆనారోగ్యం మొదలైన అంశాల ఆధారంగా ఈ జాబితాలో దేశాలకు చోటు లభించింది. పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ ఆక్స్ ఫామ్ ఈ జాబితాను రూపొందించింది. జాబితాలో కింది నుంచి చూస్తే బంగ్లాదేశ్ 24వ స్థానంలో, పాకిస్థాన్ 28వ స్థానంలో ఉంటే 29వ స్థానంలో భారత్ ఉంది. సూచీలో అత్యుత్తమ దేశంగా తొలి స్థానంలో నెదర్లాండ్స్, తర్వాత ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్ ఉన్నాయి.

  • Loading...

More Telugu News