: సంక్రాంతికి సొంతూరుకి వెళ్లిన వారికోసం స్పెషల్ బస్సులు
తెలుగువారి ప్రత్యేక పండుగ సంక్రాంతి సంబరాలను సొంతూరిలో చేసుకొనేందుకు హైదరాబాదు నుంచి అత్యధికులు బయల్దేరి వెళ్లారు. పండుగ మూడు రోజులతో పాటు ఆదివారం కలిసిరావడంతో నగరం సగం ఖాళీ అయ్యింది. నిత్యం రద్దీగా ఉండే నగర రహదారులు పట్టపగలే ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే, నగరవాసులు తిరిగి రావడానికి వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి నగరానికి సంక్రాంతి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకొనే సదుపాయాన్ని కూడా కల్పించినట్లు ఆయన చెప్పారు.