: గుండె లయను స్థిరంగా ఉంచే ఆరు ప్రోటీన్లు


ఇప్పటివరకు గుండె కణాల మధ్య సమాచార ప్రసారంలో పాలు పంచుకొనే ఒక ప్రోటీన్ గురించే తెలుసు. అయితే సెడార్స్ -సినాయ్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ కి చెందిన శాస్త్రవేత్తలు మరో ఐదు ప్రోటీన్లను గుర్తించారు. ఇవి చాలా చిన్నవే అయినప్పటికీ గుండె కొట్టుకొనే ప్రతీసారి కోట్లాది గుండె కణాలను సమన్వయం చేయడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నట్టు వీరు గుర్తించారు. ఇవి వేగంగా ప్రయాణించే విద్యుత్ సంకేతాలను నియంత్రించటంతో పాటు, గుండె కణాలను సమన్వయపరచి స్థిరంగా కొట్టుకోనేలా చేస్తాయి. గుండె బాగా పనిచేయడానికి, ఒక కణం నుంచి మరో కణానికి సమాచారం ఏ విధంగా అందుతుందనేది మరింత బాగా తెలుసుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడగలదని దీనికి నేతృత్వం వహించిన రాబిన్ షా తెలిపారు. గుండె వైఫల్య బాధితుల్లో గుండె కణాల మధ్య సమాచార ప్రసారం తక్కువగా ఉండటం వల్ల గుండెలయ దెబ్బతింటుందని షా తెలిపారు.

  • Loading...

More Telugu News