: 32 కోట్లు పలుకుతున్న 'టైటానిక్' ఫిడేలు
టైటానిక్ .... రాజసానికి ప్రతీక అయిన ఈ ప్రయాణికుల ఓడ, దారుణమైన విషాదానికి కూడా ఆనవాలుగా మిగిలిపోయిన సంగతి అందరికీ తెలుసు. 1912 ఏప్రిల్ 14 అర్ధరాత్రి వేళ ... ఇక ఆ ఓడ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ప్రయాణికులు మృత్యు భయంతో హాహాకారాలు చేస్తున్నారు. అయితే వారిలో ఆ భయాన్ని తగ్గించడం కోసం ... ఆ ఓడలో వున్న 'వాలన్ హార్ట్ లీ' సంగీత బృందం కళాకారులు ఫిడేలు రాగం పలికించారు
'టైటానిక్' సినిమాలో ఈ ఘట్టాన్ని కూడా హృద్యంగా చూపించారు. ఇప్పుడు శిధిలావస్థకు చేరిన ఆ ఫిడేలు ఆనాటి విషాదానికి గుర్తుగా మిగిలింది. ఆ వాద్యపరికరాన్ని వందేళ్ళ తర్వాత ఇప్పుడు లండన్ లో వేలానికి పెట్టారు. ఇది సుమారు 32 కోట్ల రూపాయల ధర పలుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.