: సీఎం కిరణ్ ను కలిసిన క్రిస్టియన్ సంఘాలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ను ఇవాళ (బుధవారం) సచివాలయంలో క్రిస్టియన్ సంఘాల వారు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. వికారాబాదులో జరిగిన ఫాదర్ హత్య కేసులో నిందితులను 24 గంటల్లో పట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. మైనార్టీ వర్గాల రక్షణకు కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు. మైనార్టీలపై జరుగుతున్న దాడులను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారు స్పష్టం చేశారు.
క్రిస్టియన్ సంఘాల సమస్యలను విన్న ముఖ్యమంత్రి.. ఫాదర్ హత్య కేసుపై విచారణ జరుగుతోందని, నాలుగు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామనీ చెప్పారు. ఇప్పటికే ఆ కేసులో కొన్ని ఆధారాలు లభించాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.