: పాలమేడులో జోరుగా జల్లికట్టు..41 మందికి గాయాలు
తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా సంప్రదాయ జల్లికట్టు క్రీడ జోరందుకొంది. చెన్నై సమీపంలోని పాలమేడులో నిర్వహించిన జల్లికట్టు క్రీడలో ఎద్దు పొడిచి 41 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులలో ఏడుగురిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించామని, మిగతా వారికి ప్రాథమిక చికిత్స చేసి పంపించివేశామని వారు చెప్పారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి జల్లికట్టు ఆట కోసం 530 ఎడ్లు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు.