: సమంత ఆ తప్పును మా దృష్టికి తెచ్చి వుండాల్సింది: హీరో మహేశ్ బాబు
1 నేనొక్కడినే సినిమా పోస్టర్ మహిళలను అగౌరవపరిచేలా ఉందంటూ నటి సమంత ట్విట్టర్లో పేర్కొనకుండా.. తన దృష్టికి తీసుకువస్తే బావుండేదని నటుడు మహేశ్ బాబు అన్నారు. చిత్రానికి సంబంధించి ఒక టీవీ చానల్ తో మాట్లాడుతూ.. సమంత ట్వీట్ పై మహేశ్ స్పందించాడు. 'పోస్టర్ డిజైన్ లో వచ్చిన తప్పు మా దృష్టికి రాలేదు. సమంత ట్వీట్ చేయకుండా.. మాకు చెప్పి ఉంటే సరిచేసేవాళ్లం. కనీసం సమంత తనకు క్లోజ్ గా ఉండే నా భార్య నమ్రతతోనైనా చెప్పి ఉండాల్సింది' అని మహేశ్ అన్నాడు.