: క్రెడిట్, డెబిట్ కార్డులపై ఫొటోలుండాలి: రిజర్వ్ బ్యాంకు
దేశంలో ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతుండడం పట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో క్రెడిట్, డెబిట్ కార్డులపై ఇక నుంచి వినియోగదారుల ఫొటోలు తప్పనిసరిగా ఉండాలని బ్యాంకులకు నిర్ధేశించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నమో నారాయణ్ మీనా లోక్ సభలో ఈరోజు తెలిపారు.
'ఎవరైనా కార్డులు పోగొట్టుకున్నా, కార్డులు తస్కరణకు గురైనా నష్టం వాటిల్లకుండా ఉండాలంటే, వాటిపై కస్టమర్ల ఫొటోలు ఉండేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ఆర్ బీఐ సూచించింది. బ్యాంకులు ఎప్పటికప్పుడు అత్యాధునిక పద్దతులు అందుబాటులోకి తేవడం ద్వారా ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చని ఆర్ బీఐ సూచించింది.
పైగా, సంతకాలు, పిన్ నంబర్లతో కూడిన లామినేటెడ్ కార్డులను అందజేయాలని కూడా ఆర్ బీఐ సలహా ఇచ్చింది' అని మంత్రి లోక్ సభలో లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.