: అంజలీదేవి మరణంతో అమ్మను కోల్పోయినట్లుంది: నటుడు చంద్రమోహన్


నటి అంజలీదేవి మరణంతో తన కన్నతల్లిని కోల్పోయినట్లుగా ఉందని నటుడు చంద్రమోహన్ అన్నారు. 1966లో రంగుల రాట్నం సినిమాలో అంజలీదేవి, తాను తల్లీ కొడుకులుగా కలిసి నటించినట్లు చెప్పారు. నాటి నుంచి అంజలీదేవి తనను కన్నకొడుకులా చూసుకునేవారని చంద్రమోహన్ చెప్పారు. అనారోగ్యంతో మరణించిన అంజలీదేవి అంత్యక్రియలు గురువారం చెన్నైలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రమోహన్ అంజలి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

  • Loading...

More Telugu News