శబరిమలలో అయ్యప్ప స్వాములకు మకర జ్యోతి దర్శనమిచ్చింది. మొత్తం మూడు సార్లు జ్యోతి దర్శనమైంది. జ్యోతి దర్శన సమయంలో అయ్యప్ప శరణుఘోషతో శబరిమల మారుమోగింది. జ్యోతిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు.