: రాజకీయాలు కావాలా..? అయితే జర్నలిజం వదిలేయండి


జర్నలిస్టులు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే పాత్రికేయ వృత్తి విడిచిపెట్టి రావాలని కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా పిలుపునిచ్చారు. కొంతమంది పాత్రికేయులు కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ.. పాత్రికేయ ముసుగులో రాజకీయం చే్స్తున్నారని ఆయన అన్నారు. కానీ, ఈ చర్య జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలకు విరుద్ధమని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి వారు వృత్తిని వదిలిపెట్టి.. నచ్చిన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి రావాలని ఆయన సూచించారు.

కాన్పూర్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం నుంచి పోటీకి ఏఏపీ సవాల్ విసిరిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దానికి జవాబిస్తూ మంత్రి.. కాంగ్రెస్ పార్టీ అమేథీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ అమేథీ స్థానాన్ని కోల్పోయే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News