: భారత ఆర్మీ చీఫ్ రెచ్చగొడుతున్నారు: పాకిస్థాన్
భారత ఆర్మీ చీఫ్ బిక్రమ్ సింగ్ వ్యాఖ్యలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని పాకిస్థాన్ తెలిపింది. వివరాల్లోకి వెళితే, ప్రతి ఏటా ఆర్మీ డే సందర్భంగా నిర్వహించే మీడియా సమావేశంలో మాట్లాడిన బిక్రమ్ సింగ్, పాకిస్థాన్ వ్యవహారశైలిపై విరుచుకుపడ్డారు. చొరబాటులను ప్రోత్సహించేందుకు పాక్ ఆర్మీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. ఆ సమయంలో సరిహద్దుల్లో అలజడి చెలరేగుతుందని చెప్పారు. అలాంటి సందర్భాల్లో మన సైన్యం పాకిస్థాన్ కు ధీటుగా సమాధానమిస్తుందని అన్నారు.
గతంలో మన జవాన్ల శిరస్సులను ఖండించిన సమయంలో కూడా... మన సైన్యం దీటుగా స్పందించిందని... ఆ సమయంలో మనం దాదాపు పది మంది పాక్ సైనికులను హతమార్చామని చెప్పారు. అయితే ఈ వివరాలను మీడియాకు ప్రకటించలేదని... కానీ, ఆ వార్తలు అరబ్ మీడియాలో వచ్చాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పాక్ మండిపడింది. భారత ఆర్మీ చీఫ్ రెచ్చగొడుతున్నారని తెలిపింది.