: వెదర్.. వెరీ హాట్ గురూ..
ఈ వేసవిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇంకా పూర్తిస్థాయిలో వేసవి ప్రవేశించనేలేదు, అప్పుడే ఎండలు మండుతున్నాయి. వేసవి తాపం రోజురోజుకు ఎక్కువవుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
రానున్న రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో సాధారణం కంటే మూడు డిగ్రీలు, తెలంగాణలో రెండు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయని తెలుస్తోంది.