: నటి అంజలీదేవి అంత్యక్రియలు గురువారం
అలనాటి మేటి నటి అంజలీదేవి నిన్న చెన్నైలో కాలధర్మం చెందిన విషయం విదితమే. ఆమె అంత్యక్రియలను గురువారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచిన ఆమె భౌతిక కాయాన్ని గురువారం స్వగృహానికి తరలించనున్నారు. గురువారం ఉదయం నుంచి ప్రజలు, అభిమానుల సందర్శనార్థం స్వగృహంలో ఉంచుతారు. అదే రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.